Naga Chaitanya: 'థ్యాంక్ యూ'లో చైతూ గెటప్పుల ముచ్చట!

Chaitanya Akkineni will have three get ups in Thank You film
  • ప్రస్తుతం 'లవ్ స్టోరీ'లో నటిస్తున్న చైతన్య 
  • విక్రం కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్ యూ'
  • రకుల్ నటిస్తుందనే వార్త వాస్తవం కాదు
నాగార్జున వారసుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసిన నాగ చైతన్య మెల్లమెల్లగా సెటిల్ అవుతున్నాడు. తనకు సూటయ్యే మంచి కథలు ఎంచుకుంటూ.. ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో 'మనం' ఫేం విక్రంకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి చైతూ ఇటీవల ఓకే చెప్పాడు. ముఖ్యంగా ఈ చిత్రకథ నచ్చడంతో వెంటనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో అతని పాత్ర డిఫరెంట్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. అందుకే ఇందులో మూడు విభిన్న తరహా గెటప్స్ లో చైతూ కనిపిస్తాడట.

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని, ఇంకా కథానాయిక పాత్రకు ఎవరినీ ఎంపిక చేయలేదనీ సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి 'థ్యాంక్ యూ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో చైతూ నటిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి అతనితో జోడీ కడుతోంది.
Naga Chaitanya
Vikram Kumar
Rakul Preet Singh

More Telugu News