Vishal: పెళ్లి చేసుకోవాలంటూ విశాల్ వెంటపడ్డాడు... నేనే ఒప్పుకోలేదన్న తమిళ నటి మీరా మిథున్!

Meera Midhun Contravercial Comments on Hero Vishal
  • విశాల్ మూడేళ్లు వెంటపడ్డాడు
  • డబ్బున్న వాళ్లను చేసుకోవడం నాకు ఇష్టం లేదు
  • ఓ వీడియోలో మీరా మిథున్
గతంలో తమిళ హీరోలు విజయ్, సూర్యలపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగి చేదు అనుభవాలను ఎదుర్కొన్న తమిళ నటి మీరా మిథున్, ఇప్పుడు మరో హీరో విశాల్ ను టార్గెట్ చేసింది. హీరో విశాల్ తనను వివాహం చేసుకోవాలని కోరుతూ మూడేళ్లు తిరిగాడని ఆమె తెలిపింది.

తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే, తనకు మాత్రం డబ్బున్న వాళ్లను వివాహమాడటం ఇష్టం లేదని, అందువల్లే తాను విశాల్ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. మీరా మిథున్ వ్యాఖ్యల వీడియోను ఆమె మేనేజర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. కాగా, ఇటీవల రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపైనా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై మీరా చేసిన వ్యాఖ్యల గురించి విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి!
Vishal
Meera Mithun
Tamil
Marriage

More Telugu News