Corona Virus: జిత్తులమారి కరోనా.. యాంటీబాడీలకు చిక్కకుండా రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటున్న వైరస్!

  • రక్షణ కవచంలా ఏర్పడుతున్న చక్కెరలాంటి అణువులు
  • జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగు చూసిన వైనం
  • ఒక్కో స్పైక్‌పై మూడేసి అతుకులు
Corona virus defends antibodies with spike protein

కరోనా వైరస్ జిత్తులమారిలా తయారైంది. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా తప్పించుకుంటూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. తను కూడా మానవ శరీరంలోని డీఎన్ఏనే అని ఏమరపరిచేలా ఓ ఎంజైమును విడుదల చేస్తున్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా, శరీరం విడుదల చేసే యాంటీబాడీలకు చిక్కకుండా వైరస్‌లోని కీలకమైన స్పైక్ ప్రొటీన్‌కు చక్కెరలాంటి అణువులు రక్షణ కవచంలా ఏర్పడుతున్నట్టు జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జయోఫిక్స్ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు.

కరోనా వైరస్‌పై ఉండే స్పైక్ (కొమ్ము) ప్రొటీన్ మానవ కణాలను గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ స్పైక్‌లపై చక్కెరలాంటి గ్లైకాన్లు అతుక్కుని ఉంటున్నాయని, ఒక్కో కొమ్ముపై మూడేసి అతుకులు ఉంటున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. స్పైక్ ప్రొటీన్‌లోని తుంటి, మోకాలు, చీల మండలం వంటి భాగాల కారణంగా వైరస్ స్వేచ్ఛగా వంగుతోందని తెలిపారు. శరీరంలోని యాంటీబాడీలు వీటిని గుర్తించే సమయంలో ఈ స్పైక్ ప్రొటీన్‌కు గ్లైకాన్లు రక్షణ కవచంలా అడ్డు నిలుస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

  • Loading...

More Telugu News