srisailam: నిండిపోయిన శ్రీశైలం... మూడు గేట్లు తెరిచి నీటి విడుదల!

Srisailam Dam Gates Open
  • నిండుకుండలా మారిన శ్రీశైలం
  • ఈ సీజన్ లో తొలిసారి గేట్ల ఓపెన్
  • 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి విడుదల
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. రిజర్వాయర్ నుంచి అన్ని ఎత్తిపోతల, కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్న అధికారులు, వస్తున్న ప్రవాహం పెరగడంతో మూడు గేట్లను తెరిచి, దాదాపు 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా నాగార్జున సాగర్ కు చేరనుండటంతో, ఇదే ప్రవాహం కొనసాగితే, రెండు నుంచి మూడు రోజుల్లోనే సాగర్ కూడా నిండిపోతుందని అధికారులు వెల్లడించారు. ఈ సీజన్ లో శ్రీశైలం గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
srisailam
Gates
Open
Flood

More Telugu News