curator: మాజీ క్రికెటర్, క్యురేటర్ కస్తూరి రంగన్ కన్నుమూత

Renowned curator G Kasturirangan passes away
  • ఒకప్పటి మైసూరు రాష్ట్రానికి ప్రాతినిధ్యం
  • బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలు
  • కస్తూరిరంగన్ మృతికి అనిల్ కుంబ్లే సంతాపం
ఒకప్పటి మైసూరు రాష్ట్రానికి చెందిన క్రికెటర్, ప్రముఖ క్యురేటర్ జి. కస్తూరిరంగన్ గుండెపోటుతో నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూరు రాష్ట్రం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మైసూర్ తరపున 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 94 వికెట్లు తీశారు.

1952లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా భారత జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయారు. కర్ణాటక జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన కస్తూరి రంగన్ కర్ణాటక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలందించారు. కస్తూరిరంగన్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.
curator
G. Kasturirangan
cricketer
BCCI

More Telugu News