Chiranjeevi: ఇది నేను తీసిన రెండో ఫొటో: చిరంజీవి

Chiranjeevi shares his fathers photo in twitter
  • ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరు
  • మధ్యాహ్నం పవన్ చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్
  • తాజాగా తన తండ్రి ఫొటోను షేర్ చేసిన వైనం
వరుస ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి సందడి చేస్తున్నారు. తాను తీసిన తొలి ఫొటో ఇదేనంటూ ఒక ఫొటోను ఈ మధ్యాహ్నం చిరు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తూ అభిమానులకు చిన్న టెస్ట్ కూడా పెట్టారు. దీనికి కొనసాగింపుగా చిరు మరో ట్వీట్ చేశారు. 'ఎస్.. మీ గెస్ కరెక్ట్. ఆ ఐదుగురిలో మధ్యలో ఉన్న వ్యక్తి నా చిన్న తమ్ముడు పవన్ కల్యాణ్' అని చెప్పారు. అంతేకాదు ఇది నేను తీసిన రెండో ఫొటో అంటూ మరో ఫొటోను ఆయన షేర్ చేశారు. మా నాన్న గారు అంటూ ఫొటో గురించి వివరించారు.
Chiranjeevi
Photo
Tollywood
Father

More Telugu News