Chandrababu: గతంలో నా ఫోన్‌ను చంద్రబాబు ట్యాపింగ్‌ చేయించారు.. ఆధారం ఇదిగో: సజ్జల

Chandrababu tapped my phone tweets Sajjala
  • మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు
  • ఆధారాలను న్యాయస్థానాలకు మేము సమర్పించాం
  • ఇలాంటి ఆధారాలు చంద్రబాబు ఎందుకు చూపించడం లేదు
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. విపక్ష నేతల ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఫోన్ ను చంద్రబాబు ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇది అంటూ ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఆధారాన్ని తాము న్యాయస్థానాలకు కూడా సమర్పించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.
Chandrababu
Telugudesam
Sajjala
YSRCP
Phone Tapping

More Telugu News