TRS: కరోనా బారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. జాజాల సురేందర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ

Yellareddy TRS MLA jajala surender reddy Infected to Corona Virus
  • కుటుంబ సభ్యులు, గన్‌మెన్‌లు కలిపి మొత్తం 8 మందికి పాజిటివ్
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే
  • ఇప్పటి వరకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సోకిన మహమ్మారి
తెలంగాణలో ఓవైపు కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండగా, మరోవైపు వైరస్ బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకోగా తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు వైరస్ సంక్రమించింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు, గన్‌మెన్‌లు కలిపి మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో కలుపుకుని జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు.
TRS
Telangana
Corona Virus
jajala surender reddy

More Telugu News