Anil Kapoor: 63 ఏళ్ల వయసులో ఇంత ఫిట్ నెస్ ఎలా?: అనిల్ కపూర్ ను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Anil Kapoor Fitness Picture goes Viral
  • అద్భుతమైన ఫిట్ నెస్ లో అనిల్ కపూర్
  • 'కిల్లర్ కాంబో' అన్న సునీల్ శెట్టి
  • నెట్టింట తాజా చిత్రాలు వైరల్
ఫిట్ నెస్ పరంగా తాను ఎలా ఉన్నానో చూపుతూ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ పెట్టిన ఓ పిక్, ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా, 63 సంవత్సరాల వయసులో కండలు పెంచి, ఫిట్ నెస్ ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారంటూ, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక అనిల్ కపూర్ ను చూసిన యువ హీరోలు 'వావ్...' అంటున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అనిల్ కపూర్ తన ఫోటోలు పెడుతూ, "ముఖం కంటే కండరాలే బాగా కనిపిస్తే..." అని క్యాప్షన్ పెట్టారు. అనిల్ కపూర్ చిత్రాన్ని చూసిన మరో హీరో సునీల్ శెట్టి, "కిల్లర్ కాంబో... నో ప్రాబ్లమ్, యంగ్ ఫేస్, మెచ్యూర్డ్ మజిల్" అని వ్యాఖ్యానించగా, అనిల్ ను "ఫైటర్" అని వరుణ్ ధావన్ సంబోధించాడు. 
Anil Kapoor
Fitness
Instagram

More Telugu News