President Of India: శిరోముండనం కేసును కేంద్ర సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేసిన రాష్ట్రపతి కార్యాలయం

  • సీతానగరం పీఎస్ లో యువకుడికి శిరోముండనం
  • రాష్ట్రపతికి లేఖ రాసిన యువకుడు
  • కేసును జీఏడీ సహాయ కార్యదర్శికి అప్పగించిన రాష్ట్రపతి
  • సహాయ కార్యదర్శి స్పందించడం లేదన్న యువకుడు
President office transfers tonsure case to social justice ministry

కొన్నిరోజుల కిందట ఏపీలో తీవ్ర కలకలం రేపిన శిరోముండనం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును రాష్ట్రపతి కార్యాలయం కేంద్ర సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేసింది. శిరోముండనం బాధితుడు ప్రసాద్ తనకు న్యాయం జరగడంలేదని, తనకు నక్సలైట్లలో చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ వ్యవహారాన్ని పరిశీలించాలంటూ ఏపీ జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్ బాబుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

అయితే, బాధితుడు ప్రసాద్... జనార్దన్ బాబు సరిగా స్పందించడం లేదని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో, ఆ కేసు ఫైల్ ను కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అత్యవసర ప్రాతిపదికన విచారించాలని స్పష్టం చేసింది. ఇటీవల ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది.

More Telugu News