Kangana Ranaut: ఆ అవార్డుకు కరణ్ జొహార్ అనర్హుడు... నన్ను కూడా బెదిరించాడు: కంగన

Kangana Ranaut fired again on Bollywood film maker Karan Johar
  • కరణ్ పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలన్న కంగన
  • బాలీవుడ్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడని వెల్లడి
  • సుశాంత్ కెరీర్ నాశనం చేసింది కరణ్ అంటూ వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జొహార్ పై మరోసారి నిప్పులు చెరిగారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు కరణ్ జొహారే కారణమని ఆరోపించారు. సుశాంత్ సినీ కెరీర్ ను నాశనం చేశాడని, తద్వారా అతడి ఆత్మహత్యకు పరోక్ష కారకుడయ్యాడని తెలిపారు. కరణ్ జొహార్ కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.

కరణ్ తనను కూడా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించారని, ఓ అంతర్జాతీయ వేదిక నుంచి తనను బెదిరించారని కంగన వెల్లడించారు. బాలీవుడ్ నుంచి వెళ్లిపోవాలంటూ తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారని వివరించారు. చివరికి భారత సైన్యాన్ని అవమానించే రీతిలో పాకిస్థాన్ కు అనుకూలంగా దేశ వ్యతిరేక సినిమా తీశారని కరణ్ జొహార్ పై మండిపడ్డారు.
Kangana Ranaut
Karan Johar
Sushant Singh Rajput
Bollywood

More Telugu News