telegram: టెలిగ్రామ్‌లో కొత్త ఫీచర్లతో వీడియో కాల్స్‌

  • ఒకరికి మాత్రమే వీడియో కాల్ చేసుకునేలా ముందుగా ఫీచర్ 
  • భవిష్యత్‌లో గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యం
  • ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటన
  • ఇతర విషయాలను చూసుకుంటూనే వీడియో కాల్ 
video calls feature in telegram

ఎన్నో ఫీచర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన మెసేజింగ్‌ యాప్ టెలీగ్రామ్‌ వీడియో కాల్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులు త్వరలోనే ఈ సౌకర్యాన్ని పొందొచ్చని పేర్కొంది. ఒకరికి మాత్రమే వీడియో కాల్ చేసుకునేలా పీచర్‌ను తీసుకొస్తామని ప్రకటించింది.

భవిష్యత్‌లో గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యం తీసుకొస్తామని తెలిపింది. తమ ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ కంపెనీ ఈ ప్రకటన చేసింది. తాము తీసుకొస్తున్న వీడియో కాల్‌లో అనేక ఫీచర్లు ఉంటాయని, మొబైల్‌లో ఇతర విషయాలను చూసుకుంటూనే వీడియో కాల్‌లోనూ మాట్లాడుకోవచ్చని తెలిపింది.

ఇందు కోసం ఇందులో పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ సదుపాయం తీసుకొస్తామని చెప్పింది. వీడియో కాల్‌ నుంచి వాయిస్‌ కాల్‌కు కూడా మార్చుకోవచ్చని తెలిపింది. ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో ఈ ఫీచర్‌లో పూర్తి భద్రత ఉంటుందని చెప్పింది. టెలీగ్రామ్‌లో‌ 2017 నుంచి ఆడియో కాల్స్‌ సదుపాయం అందుబాటులో ఉంది.

More Telugu News