Actress Madhavilatha: హిందువుల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు నమోదు

Case filed against Actress and BJP leader Madhavilatha
  • ఫేస్‌బుక్ ఖాతాలో వివాదాస్పద పోస్టు
  • ఫిర్యాదు చేసిన వనస్థలిపురం విద్యార్థి
  • సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటి తన ఫేస్‌బుక్ ఖాతాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టు పెట్టారన్న ఫిర్యాదుతో ఆమెపై సెక్షన్ 295-ఎ కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. 
Actress Madhavilatha
BJP
Hindus
police case

More Telugu News