Car: విజయవాడలో దారుణం... కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి దహనం

Car set into fire by goons at Vijayawada Novatel Hotel
  • ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
  • వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం
  • ఘటనకు రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని అనుమానం
విజయవాడలో దారుణ ఘటన జరిగింది. నగరంలోని నోవాటెల్ హోటల్ వద్ద ఓ కారును దుండగులు దహనం చేశారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారులోని ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వివాదాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. కొన్నాళ్ల కిందట రియల్ ఎస్టేట్ వివాదాల కారణంగానే దొమ్మీ తరహాలో రెండు ముఠాలు భీకరంగా కలబడిన సంగతి తెలిసిందే.
Car
Fire
Novatel Hotel
Vijayawada

More Telugu News