SP Charan: నాన్న ఆరోగ్య పరిస్థితి నిన్న ఎలావుందో ఇవాళ కూడా అలాగే ఉంది: ఎస్పీ చరణ్

SP Charan tells about his father SP Balu health condition
  • కరోనా బారినపడిన ఎస్పీ బాలు
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
  • తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందన్న చరణ్
కరోనా సోకిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. నిన్న ఎలావుందో ఇవాళ కూడా ఆరోగ్యం అలాగే ఉందని, ఆందోళన చెందాల్సిన సమస్యలేవీ రాలేదని చెప్పారు. తన తండ్రి కోలుకుంటున్న తీరు పట్ల డాక్టర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఆయన త్వరలోనే మామూలు మనిషై అందరి మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు గొప్పవాడు, మీ ప్రార్థనలు గొప్పవి అంటూ తమ శ్రేయోభిలాషులకు, అభిమానులకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కరోనా బారినపడిన ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు అర్ధాంగి కూడా కరోనా బారినపడినా, ఆమె పరిస్థితి బాలు కంటే మెరుగ్గా ఉందని తెలిసింది.
SP Charan
SP Balu
Corona Virus
Treatment
MGM Hospital
Chennai

More Telugu News