Reliance: మరో రెండు సంస్థలను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్

Reliance In Talks To Buy Online Furniture Retail and Milk Delivery Startups
  • అర్బన్ ల్యాడర్, మిల్క్ బాస్కెట్ లపై రిలయన్స్ దృష్టి
  • చివరి దశకు చేరుకున్న చర్చలు
  • డీల్ విలువ రూ. 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా
తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిమగ్నమై ఉంది. ఆన్ లైన్ ఫర్నిచర్ రిటైలర్ అయిన అర్బన్ ల్యాడర్, పాల సరఫరా సంస్థ మిల్క్ బాస్కెట్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వస్తోంది. దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. రాయిటర్స్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఇప్పటికే ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ డీల్ విలువ సుమారు 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే, దీనిపై ఇప్పటి వరకు రిలయన్స్, అర్బన్ ల్యాడర్, మిల్క్ బాస్కెట్ సంస్థలకు చెందిన ప్రతినిధులెవరూ అధికారికంగా స్పందించలేదు. కరోనా నేపథ్యంలో మన దేశంలో ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. పాల వంటి నిత్యావసర వస్తువులను సైతం ఆన్ లైన్ ద్వారా వినియోగదారులు తెప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థలపై రిలయన్స్ దృష్టి సారించింది.
Reliance
Milk Basket
Urban Ladder

More Telugu News