Chandrababu: రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది: ప్రధాని మోదీకి లేఖ రాసిన చంద్రబాబు

Chandrababu writes PM Modi on phone tapping
  • వైసీపీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆరోపణలు 
  • ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వెల్లడి
  • లేఖ కాపీని ఐటీ మంత్రిత్వ శాఖకు కూడా పంపిన బాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి  లేఖ రాశారు. అదే లేఖ మరో కాపీని ఆయన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు కూడా పంపారు. ఈ లేఖలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని, దీని వెనుక అధికార వైసీపీ హస్తం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. విపక్ష నేతలు, లాయర్లు, పాత్రికేయులు, పార్టీ కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Narendra Modi
Phone Tapping
YSRCP
Andhra Pradesh

More Telugu News