Vijayasai Reddy: పవన్ కల్యాణ్ అభిమాని చికిత్సకు రూ.10 లక్షలు మంజూరుచేసి, జగన్ గారు తన ఔదార్యాన్ని చాటారు: విజయసాయిరెడ్డి

Jagan sanctioned Rs 10 lacs for Pawan Kalyans fan says Vijayasai Reddy
  • ప్రజా సంక్షేమమే జగన్ కు ముఖ్యం
  • పవన్ అభిమాని స్టెమ్ సెల్ థెరపీ కోసం ఆర్థిక సాయం చేశారు
  • ఇప్పటి వరకు కోటి మందికి పైగా ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందాయి
ప్రజల హితం, సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్యమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమాని స్టెమ్ సెల్ థెరపీ కోసం రూ. 10 లక్షలు శాంక్షన్ చేసి జగన్ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారని చెప్పారు. పార్టీకి, కులాలకు, వర్గాలకు అతీతుడినని జగన్ మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు.

జగన్ 14 నెలల పాలనలో సరికొత్త రికార్డును నెలకొల్పారని విజయసాయి అన్నారు. కోటి మందికి పైగా ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందాయని... ఎవరికీ ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులు అవసరం లేదని చెప్పారు. కార్యాలయాల చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదని... గ్రామ వాలంటీర్లే అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు.
Vijayasai Reddy
YSRCP
Jagan
Pawan Kalyan
Janasena

More Telugu News