KTR: వరదలో కొట్టుకుపోయిన తెరాస నేత.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్న కేటీఆర్

trs leader missing in water flow siddipet
  • సిద్ధిపేట జిల్లా శనిగరం, బద్దిపల్లి రోడ్డులో ఘటన
  • ఇన్నోవా వాహనంలో వెళ్లిన  జంగపల్లి శ్రీనివాస్‌
  • ముగ్గురిని కాపాడిన స్థానికులు
  • శ్రీనివాస్‌ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
సిద్ధిపేట జిల్లా శనిగరం, బద్దిపల్లి రోడ్డు మీదుగా ఇన్నోవా వాహనంలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో అక్కడి వాగులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లికు చెందిన టీఆర్‌ఎస్‌ నేత జంగపల్లి శ్రీనివాస్‌ గల్లంతయ్యారు. వారు వాగులో కొట్టుకుపోతోన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా, శ్రీనివాస్ మాత్రం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.

దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించి.. సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. శ్రీనివాస్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. గాలింపు చర్యలను పర్యవేక్షించడానికి సిద్ధిపేట ఆర్డీవో ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు.
KTR
TRS
Siddipet District

More Telugu News