Donald Trump: నిన్న టిక్‌టాక్‌.. నేడు అలీబాబాను టార్గెట్ చేసిన ట్రంప్!

  • అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం 
  • కరోనా వ్యాప్తి, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలు
  • నిషేధాన్ని విధించే ఛాన్స్ ఉన్న సంస్థల జాబితాలో అలీబాబా
trump targers alibaba

అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్‌ పుట్టినిల్లు చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడుతోన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ నిషేధం దిశగా అడుగులు వేస్తోన్న ట్రంప్.. ఆ సంస్థ తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని టిక్‌టాక్‌ను విక్రయించాలని ఇప్పటికే డెడ్‌లైన్‌ పెట్టారు. ప్రస్తుతం చైనాకు చెందిన అలీబాబా సంస్థను ఆయన టార్గెట్ చేశారు.

అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్నారు. అమెరికాలో కొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో తమ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కూడా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనాకు చెందిన అలీబాబా సంస్థపై ఈ విధంగా స్పందించారు.

నిషేధాన్ని విధిస్తోన్న సంస్థల జాబితాలో అలీబాబాతో పాటు పలు సంస్థలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఉన్నాయనే సంకేతాలను ట్రంప్ ఇచ్చారు. అలాగే, తమ దేశంలో చైనాకు చెందిన ఇతర కంపెనీల నిషేధం విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, కరోనాను తమ దేశంలో వూహాన్ నగరం దాటనివ్వకుండా చేసిన చైనా ప్రపంచానికి మాత్రం ఎందుకు వ్యాప్తి చేసిందని ట్రంప్ గతంలో మండిపడ్డ విషయం తెలిసిందే.

More Telugu News