Corona Virus: దేశంలో 50 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

Coronavirus deaths in India cross 50000
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 57,982 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 941 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 26,47,664కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 50,921 కి పెరిగింది. ఇక 6,76,900 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు.
                                                                                  
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,00,41,400 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,31,697 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News