Hyderabad: మందులు వాడుతూ.. ఆవిరి పట్టడంతో కరోనా పరార్: వైద్యుల పరిశోధనలో వెల్లడి

  • మందులు వాడుతూనే ఆవిరి పడితే శ్వాస ప్రక్రియ మెరుగు
  • శ్వాస క్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది
  • హైదరాబాద్ వైద్యుల పరిశోధనలో వెలుగు చూసిన వైనం
steam therapy is best against corona fight

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆవిరి పట్టడానికి మించిన ఔషధం మరోటి లేదని తాజాగా వైద్యులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. రోజూ మూడుసార్లు ఓ క్రమ పద్ధతిలో ఆవిరి పట్టడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 20 వేల మంది కరోనా బాధితుల్లో 15 వేల మంది ఇంట్లోనే ఉండి వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారని, అయితే, హోం ఐసోలేషన్‌లో వారికి సరైన వైద్య సదుపాయం అందడం లేదని హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స అందించే ప్రధాన వైద్యుడు ఒకరు తెలిపారు.

సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు, స్నేహితుల సూచనల ఆధారంగా కొందరు వైద్యం చేసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా సోకినవారు తొలి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. కొందరు అతిగా కషాయం తాగేస్తున్నారని, మరికొందరు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతున్నారని వివరించారు. అప్పటికే చాలామంది ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్ వెళ్లకుండా అడ్డుపడుతోందని, పరిస్థితి మరీ విషమిస్తే న్యూమోనియాకు అది దారి తీస్తుందని హెచ్చరించారు.

కాబట్టి రోజూ మూడుపూటలా 15 నిమిషాలపాటు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఓ పాత్రలో మరిగించిన నీటిలో ట్యూబ్ ముందు కానీ, పసుపు కానీ వేసి పావుగంటపాటు ఆవిరి పీల్చాలని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా రక్తనాళాలు వ్యాకోచించి వాటి పనితీరు మెరుగుపడుతుందని, శ్వాస క్రియకు అడ్డుపడుతున్న సెకండరీ ఇన్ఫెక్షన్ తొలగిపోయి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News