Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Keerthi Suresh movie skips theatrest
  • ఓటీటీ ద్వారా కీర్తి సురేశ్ మూవీ 
  • 'ఆహా'కు కొత్త తరహా సీరీస్
  • అమెజాన్ ప్రైమ్ ద్వారా నాని 'వి'  

*  కీర్తి సురేశ్ కథానాయికగా నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన 'గుడ్ లక్ సఖి' చిత్రం ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఈ చిత్ర నిర్మాతలు తాజాగా ఓ స్ట్రీమింగ్ సంస్థతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
*  అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని 'ఆహా' ఓటీటీ ప్లేయర్ కోసం పలువురు దర్శకులు ప్రాజక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సాగర్ చంద్ర ఓ సీరీస్ ను చేస్తున్నాడు. సైన్స్, హిస్టరీ, టెక్నాలజీ రంగాల ఆవిష్కరణలపై ఈ సీరీస్ రూపొందుతుందట.      
*  నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'వి' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ కు హక్కులను ఇచ్చేశారట. వచ్చే నెలాఖరులో ఇది అక్కడ ప్రసారం కావచ్చని తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News