Trump Pills: ట్రంప్ తల ఆకారంలో మత్తు మాత్రలు... తయారీదారుల క్రియేటివిటీకి బ్రిటన్ పోలీసులు ఫిదా!

Britain Bedford Shire police seized Trump face like pills
  • ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన బెడ్ ఫోర్డ్ షైర్ పోలీసులు
  • అతడి నుంచి ఆరెంజ్ రంగులో ఉన్న మాత్రలు స్వాధీనం
  • ట్రంప్ పిల్స్ గా అమ్మకాలు సాగిస్తున్న వైనం
తాజాగా బ్రిటన్ లో బెడ్ ఫోర్డ్ షైర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఆరెంజ్ కలర్ లో ఉన్న మాత్రలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ మాత్రలు అచ్చం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలను పోలివున్నాయి. ట్రంప్ తలకట్టును ఆధారంగా చేసుకుని ఆ మాత్రను డిజైన్ చేసిన వాటి తయారీదార్ల క్రియేటివిటీకి బ్రిటన్ పోలీసులు ఆశ్చర్యపోయారు.

కాగా, ఈ ఆరెంజ్ కలర్ మాత్రలను ట్రంప్ పిల్స్ పేరుతో అమ్మకాలు సాగిస్తుంటారని బ్రిటన్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో ప్రమాదకరమైన ఎండీఎంఏ అనే పదార్థం ఉంటుందని, వీటిని వాడితే గొంతు ఎండిపోయి, హృదయస్పందన వేగం పుంజుకుంటుందని, తీవ్ర అస్వస్థతకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు.
Trump Pills
Police
Bedford Shire
Britain

More Telugu News