Ramcharan: ఎవరూ లేరనుకున్న సమయంలో నువ్వొచ్చావు... థాంక్యూ ధోనీ!: రామ్ చరణ్

  • ఇంటర్నేషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ధోనీ
  • దేశం కోసం ప్రపంచాన్నే జయించావంటూ వ్యాఖ్యలు
  • లైనప్ కు స్థిరత్వాన్ని తీసుకొచ్చావంటూ ట్వీట్
Ram Charan says he will cherish Dhoni victories forever

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నిన్న ప్రకటించడం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ స్పందించారు. "మన బ్యాటింగ్ లైనప్ కు స్థిరత్వం తీసుకువచ్చే సమర్థుడైన వికెట్ కీపర్ కోసం వేచిచూస్తున్న తరుణంలో నువ్వొచ్చావు. వచ్చావు, ఆడావు, భారత్ కోసం ప్రపంచాన్నే జయించావు. థాంక్యూ ఎంస్ డీ. మ్యాచ్ లను గెలిపించిన నీ ఇన్నింగ్స్ లను, మెరుపువేగంతో స్టంప్ లను గిరాటేసే నీ స్టంపింగ్ లను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ధోనీ వీడ్కోలుపై వ్యాఖ్యానించారు. "నువ్వు మాకు వినోదాన్నిచ్చావు, మేం గర్వపడేలా చేశావు. అంతకంటే ఎక్కువగా, నరాలు తెగే ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తినిచ్చావు. కానీ నీ వీడ్కోలు క్షణాలను జీర్ణించుకోవడం కష్టమే. ధోనీ... రాబోయే తరాలకు కూడా నువ్వు మార్గదర్శి లాంటివాడివి" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

More Telugu News