JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

jc prabhakar reddy in police custody
  • అట్రాసిటీ కేసులో విచారణ
  • దళిత సీఐ దేవేంద్రను దూషించారని ఆరోపణలు
  • కడప జైలు నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
  • ఆసుపత్రిలో వైద్య పరీక్షలు  
అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఒక్కరోజు కస్టడీకి తీసుకోవడానికి నిన్న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు కస్టడీకి తీసుకున్నారు. ఆయనను కడప జైలు నుంచి తీసుకుకెళ్లి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, అనంతరం అక్కడి నుంచి మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఆయనను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు ఆయనను తిరిగి కడప జైలుకు తరలించనున్నారు.  దళిత సీఐ దేవేంద్రను దూషించి బెదిరించిన కేసులో ఆయనపై ఇటీవల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.
JC Prabhakar Reddy
Telugudesam
Andhra Pradesh
Anantapur District

More Telugu News