Devineni Uma: ఏపీలో మూడు లక్షలకు చేరువలో కేసులు: దేవినేని ఉమ విమర్శలు

  • 2,500 దాటిన మరణాలు
  • రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా
  • పరీక్షలు చేసిన వాళ్లలో 16.5 శాతం మందికి నిర్ధారణ
  • వైద్యం, వసతి సౌకర్యాలపై ప్రజల అసంతృప్తి 
coronavirus cases in ap going to reach  3 lakhs devineni uma

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణపై స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,732 మంది కొవిడ్‌ బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాలు పలు దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటిని పోస్ట్ చేస్తూ  ఏపీ సర్కారుపై దేవినేని ఉమ మండిపడ్డారు.

'మూడు లక్షలకు చేరువలో కేసులు, 2,500 దాటిన మరణాలు. రాష్ట్రంలో విస్తరిస్తున్నకరోనా. పరీక్షలు చేసిన వాళ్లలో 16.5 శాతం మందికి నిర్ధారణ. వైద్యం, వసతి సౌకర్యాలపై ప్రజల అసంతృప్తి. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఎన్నినిధులు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదలచేస్తారా జగన్‌ గారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

More Telugu News