MS Dhoni: కన్నీళ్లను దిగమింగుకొని ధోనీ రిటైర్మెంట్‌: భార్య సాక్షి

sakshi on dhoni retirement
  • భారత్‌ గర్వపడేలా ఎన్నో విజయాలను అందించారు
  • వీడ్కోలు పలికేటప్పుడు ధోనీ పడిన మనోవేదన నాకు తెలుసు
  • ధోనీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి
  • ఆయన అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేం
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆయన భార్య సాక్షి సింగ్‌ స్పందిస్తూ.. భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. భారత్‌ గర్వపడేలా దేశానికి ఎన్నో విజయాలను ధోని అందిచాడని చెప్పారు.

ఆ సమయంలో ఆయన అందించిన అనుభూతిని దేశ ప్రజలు మర్చిపోలేరని సాక్షి అన్నారు. రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికే క్రమంలో ధోనీ పడిన మనోవేదన తనకు తెలుసని అన్నారు.

కన్నీళ్లను దిగమింగుకొని ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించారని తాను అనుకుంటున్నట్లు సాక్షి పేర్కొన్నారు. ధోనీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ధోనీ చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, క్రికెట్‌ అభిమానులకు ఆయన అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరని ఆమె చెప్పారు.
MS Dhoni
Cricket
Instagram

More Telugu News