Chandrababu: చంద్రబాబు లైవ్ లో ఉండగా, ఫ్రేమ్ లోకి వచ్చేసిన దేవాన్ష్... వైరల్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు!

Devansh Enter into Grandfather Chandrababu Live Goes Viral
  • ఇటీవల జూమ్ లో చంద్రబాబు ప్రెస్ మీట్
  • వెనుకవైపున్న పుస్తకం కోసం వచ్చిన దేవాన్ష్
  • దేవాన్ష్ క్రమశిక్షణకు టీడీపీ శ్రేణుల ఆశ్చర్యం
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన జూమ్ యాప్ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దీన్ని తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున వైరల్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్న వేళ, వెనుకే ఉన్న బుక్ ర్యాక్ వద్దకు తనకు కావాల్సిన పుస్తకం కోసం దేవాన్ష్ రావడం, ఆ ఫ్రేమ్ లో కనిపించడమే ఇందుకు కారణం.

ఇక తన తాతయ్య, ఓ సమావేశంలో ఉన్నారన్న సంగతిని వెంటనే అర్థం చేసుకున్న దేవాన్ష్, మెల్లగా నక్కుతూ వెళ్లాడు. ఆపై పాకుతూ పక్కకు జరిగి, అక్కడే ఉన్న 'అక్బర్ బీర్బల్' కథల పుస్తకాన్ని తీసుకుని వెళ్లాడు. దేవాన్ష్ కనిపిస్తున్న వీడియో క్లిప్ ను కట్ చేసిన టీడీపీ శ్రేణులు దీన్ని నెట్టింట పెట్టగా, పలు కామెంట్లు వస్తున్నాయి. చిన్న వయసులోనే తాతయ్య బిజీగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని, చాలా క్రమశిక్షణతో దేవాన్ష్ మెలగుతున్నాడని, ఇది గొప్ప విషయమని కామెంట్లు పెడుతున్నారు.

తాతయ్యను డిస్ట్రబ్ చేయకూడదన్న విషయాన్ని దేవాన్ష్ తెలుసుకున్నాడని, చిన్న వయసులోనే పరిపక్వత సాధించాడని, ఇదేమీ మామూలు విషయం కాదని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియోకు షేర్లు, లైక్స్ తెగ వచ్చేస్తున్నాయి. దాన్ని మీరూ చూసేయండి.
Chandrababu
Devansh
Live Video
Zoom

More Telugu News