Chetan Chauhan: వెంటిలేటర్ పై మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్.. ఆరోగ్య పరిస్థితి విషమం!

Former Indian cricketer Chetan Chauhan is on life support
  • గత నెలలో కరోనా బారిన పడిన చౌహాన్
  • నిన్న వెలుగుచూసిన కిడ్నీ, బీపీ సమస్యలు
  • గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స
అలనాటి దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో పాటు, కిడ్నీ సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది.

గత నెలలో చౌహాన్ కు కరోనా సోకింది. తొలుత లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో... మెరుగైన చికిత్స కోసం మేదాంత ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పోరాడుతున్న ఆయనలో నిన్న కిడ్నీ, రక్తపోటు వంటి సమస్యలు కూడా వెలుగుచూశాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలతో క్రికెటర్లు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Chetan Chauhan
Cricketer
Corona Virus
Kidney Problem

More Telugu News