Varla Ramaiah: అద్భుతమైన నీతివాక్యములు పలికినారు... అంటూ విజయసాయిరెడ్డిపై వర్ల రామయ్య వ్యాఖ్యలు

Varla Ramaiah says he welcomes Vijayasai Reddy comments on land grabbers
  • భూకబ్జాలపై విజయసాయి వ్యాఖ్యలు బాగున్నాయన్న వర్ల
  • అభినందనలు అంటూ ట్వీట్
  • బహుపరాక్ విశాఖ అంటూ వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గారూ, విశాఖలో ఎవరు భూ కబ్జాలకు పాల్పడినా వదిలేది లేదంటూ బాగా సెలవిచ్చారని ట్వీట్ చేశారు. "అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాలని కోరారు. మీ పార్టీ వారిని కూడా వదలొద్దని అద్భుమైన నీతి వాక్యములు పలికినారు. మీకు నా అభినందనలు. అవునులే, ఈ పేటెంట్ వేరెవరికీ దక్కకూడదనే కదా మీ ప్రయత్నం... అవునా? విశాఖ బహుపరాక్!" అంటూ స్పందించారు.
Varla Ramaiah
Vijayasai Reddy
Visakhapatnam
Land Grabbing

More Telugu News