Somu Veerraju: పూరీ జగన్నాథ్ గారూ, మీ పోడ్ కాస్ట్ చాలా బాగుంది: సోము వీర్రాజు

Somu Veerraju appreciates pod casts of Puri Jagannadh
  • సామాజిక అంశాలపై పోడ్ కాస్ట్ నిర్వహిస్తున్న పూరీ
  • ఆకట్టుకుంటున్న పూరీ పోడ్ కాస్ట్ ఎపిసోడ్లు
  • పూరీ ఆలోచన అభినందనీయం అంటూ సోము ట్వీట్
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొన్నిరోజులుగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న పోడ్ కాస్ట్ ఎపిసోడ్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సామాజిక అంశాలపై పూరీ స్పందిస్తున్న తీరును పలువురు అభినందిస్తున్నారు. తాజాగా పూరీ చేసిన మేరా భారత్ మహాన్ అనే పోడ్ కాస్ట్ పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.

"పూరీ జగన్ గారూ, మీ తాజా పోడ్ కాస్ట్ విన్నాను. చాలా బాగుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమం నిర్వహించాలన్న మీ ఆలోచన అభినందనీయం. ఇతరులకు ఆదర్శనీయం. ఇలాగే మీరు మరెన్నో అంశాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... హమారా భారత్ మహాన్" అంటూ ట్వీట్ చేశారు.
Somu Veerraju
Puri Jagannadh
Pod Cast
Social Issues

More Telugu News