Kesineni Nani: ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

TDP MP Kesineni Nani met union minister Nitin Gadkari in Delhi
  • గడ్కరీకి లేఖ అందజేసిన కేశినేని నాని
  • ఫ్లైఓవర్ పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతలు
  • ప్రారంభోత్సవం చేయాలంటూ విజ్ఞప్తి
విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనకు లేఖను అందజేశారు. దీనిపై నాని ట్వీట్ చేశారు. విజయవాడ పౌరుల చిరకాల స్వప్నం అయిన కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తయిన సందర్భంగా గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. అంతేగాకుండా, విజయవాడ వచ్చి ఫ్లైఓవర్ ను ఆయన అమృతహస్తాలతో ప్రారంభించవలసిందిగా కోరినట్టు తెలిపారు. మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మీరు ప్రారంభిస్తేనే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నగరానికి కనకదుర్గ ఫ్లైఓవర్ అందమైన మణిహారం వంటిదని అభివర్ణించారు.
Kesineni Nani
Nitin Gadkari
Kanakadurga Flyover
Vijayawada
Telugudesam

More Telugu News