కీసర తహసీల్దార్ కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు
- కోట్లలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర తహసీల్దార్
- హైదరాబాదు శివార్లలో అక్రమాస్తులు పోగేసినట్టు గుర్తింపు
- అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లపైనే ఉంటుందని అంచనా
తహసీల్దార్ నాగరాజు ఆస్తుల విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. హైదరాబాదు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నాగరాజును పట్టుకున్న సమయంలో లంచం సొమ్ము రూ.1.10 కోట్లతో పాటు ఇంట్లో సోదాలు చేసి మరో రూ.28 లక్షలు, 2 కిలోల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను కూడా సీజ్ చేశారు.