Hyderabad: హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్

Janasena Chief Pawan Kalyan Celebrates Independence day
  • జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
  • నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ హాజరు
  • కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమ నిర్వహణ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాగా, కొవిడ్-19 నేపథ్యంలో సామాజిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Hyderabad
Janasena
Pawan Kalyan
Independence day

More Telugu News