Meerut: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ తల తెస్తే రూ. 51 లక్షల నజరానా: షహజీబ్ రిజ్వీ

Meerut man who declared bounty Rs 51 lakh bounty on Karnataka MLA nephew arrested
  • నిందితుడు గతంలో సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి
  • వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు
  • ఇలాంటి పోస్టులు సహజమేనన్న నవీన్ తండ్రి
కర్ణాటక ఎమ్మెల్యే ఆర్.అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ తల తెచ్చి ఇస్తే రూ. 51 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద ట్వీట్ చేసిన మీరట్‌కు చెందిన షహజీబ్ రిజ్వీని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్‌లోని ఫలవాడాకు చెందిన రిజ్వీ గతంలో సమాజ్‌వాదీ పార్టీలో పనిచేశాడు. పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రిజ్వీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు మీరట్ ఎస్పీ (రూరల్) అవినాశ్ పాండే తెలిపారు.

బెంగళూరులోని డీజే హళ్లి-కేజీ హళ్లి అల్లర్లకు కారణమైన పులకేశినగర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్‌ తల తెస్తే రూ.51 లక్షలు నజరానాగా ఇస్తానంటూ ట్విట్టర్‌లో రిజ్వీ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, రిజ్వీ పోస్టుపై నవీన్ తండ్రి పవన్ కుమార్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు సహజమని కొట్టిపడేశారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు ఉన్నారని, కోర్టులు శిక్షిస్తాయని పేర్కొన్నారు.
Meerut
Karnataka MLA
RA Srinivasmurthy
Shahzeb Rizvi
Bengaluru Riots

More Telugu News