Tamil Nadu: కరోనా కోరల నుంచి బయటపడిన తమిళనాడు గవర్నర్

Tamil Nadu governor Banwarilal Purohit tests negative for Covid
  • తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మంది ఉద్యోగులకు కరోనా
  • ధైర్యం, సంకల్పం వల్లే కోలుకున్నారన్న వైద్యులు
  • రెండువారాలపాటు ఐసోలేషన్‌లో ఉన్న గవర్నర్
కరోనా మహమ్మారి బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (80) కోలుకున్నారు. నిన్న రాత్రి ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన చురుగ్గా ఉన్నారని, ధైర్యం, సంకల్పం వల్లే ఆయన త్వరగా బయటపడగలిగారని పేర్కొన్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో మొత్తం 84 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. గవర్నర్‌లోనూ స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో రెండు వారాల క్రితమే గవర్నర్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రి వైద్యులు ఆయనను 24 గంటలూ పర్యవేక్షిస్తూ వచ్చారు.
Tamil Nadu
Governor
Banwarilal purohit
COVID-19

More Telugu News