Chandrababu: ఎస్పీ బాలును ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది: చంద్రబాబు

TDP Chief Chandrababu expresses concern over SP Balasubrahmanyam health
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఎస్పీ బాలుకు చికిత్స
  • బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు
  • క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థించుదాం అంటూ ట్వీట్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. కరోనా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఎస్పీ బాలు కరోనా నుంచి కోలుకుని, క్షేమంగా బయటికి రావాలని భగవంతుడ్ని మనసారా ప్రార్ధించుదాం అంటూ పిలుపునిచ్చారు. ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనా కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. నిన్న రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
Chandrababu
SP Balasubrahmanyam
Corona Virus
MGM Hospital
Chennai

More Telugu News