Raghurama Krishnaraju: ఐదుగురు ఎన్టీఆర్ లు పాడితే శిల కరిగినట్టు జగన్ హృదయం కూడా కరగొచ్చు: రఘురామకృష్ణరాజు

  • ఢిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం
  • ఏపీ రాజధాని అంశంపై మాట్లాడిన నరసాపురం ఎంపీ
  • జగన్ కరగకపోయినా న్యాయస్థానాలున్నాయని వెల్లడి
Raghurama Krishnaraju expects CM Jagan would respond in favor of Amaravathi

ఏపీ రాజధాని అంశంపై నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం జరగని పని అని స్పష్టం చేశారు. ఇక్కడి రైతు సంఘాలు ఎంతో సమర్థులైన న్యాయవాదులను నియమించుకున్నాయని, రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరిగి తీరుతుందని అన్నారు.


తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయడం కోసం రూ.60 వేల కోట్లు అడగడం చిగురంత ఆశ రేకెత్తిస్తోందని, సీఎం జగన్ హృదయం కూడా కరుగుతోందేమో అనిపిస్తోందని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.  

జగదేకవీరుని కథ సినిమాలో ఐదుగురు ఎన్టీ రామారావులు వచ్చి పాట పాడినప్పుడు కఠిన శిల కూడా కరుగుతుందని, అలాగే రాజధాని రైతుల ఆక్రందనలు, మహిళలు గాంధేయవాదం అనుసరించి చేస్తున్న నిరసనలు కూడా సీఎం జగన్ చెవికి ఓ నాలుగు రోజులు ఆలస్యమైనా తప్పక చేరతాయని, ఆయన అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారన్న ప్రగాఢ విశ్వాసం తనకు కలుగుతోందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన మనసు కరగకపోయినా ఈలోపే న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు.

More Telugu News