Ramana Dikshitulu: అర్చకులను రక్షించడంలో టీటీడీ విఫలమైంది: రమణ దీక్షితులు

TTD failed in protecting lives of archakas says Ramana Dikshitulu
  • వంశపారంపర్య సేవల కోసం పోరాడుతూ మాజీ ప్రధాన అర్చకుడు చనిపోయారు
  • 45 ఏళ్ల అర్చకుడు స్వామికి సేవలందిస్తూ మరణించారు
  • వీరి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించండి
అర్చకుల రక్షణ విషయంలో టీటీడీ పూర్తిగా విఫలమైందని తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు. ఇటీవల కన్నుమూసిన అర్చకుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ కు విన్నవించారు. అక్రమంగా పదవీ విరమణకు గురైన మాజీ ప్రధాన అర్చకుడు ఒకరు వంశపారంపర్య సేవలను పునరుద్ధరించాలని పోరాడుతూ మరణించారని చెప్పారు. మరో 45 ఏళ్ల జూనియర్ అర్చకుడు స్వామికి సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వీరిని కాపాడడంలో టీటీడీ విఫలమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ట్వీట్ ను జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్యాగ్ చేశారు.
Ramana Dikshitulu
TTD
Jagan
YV Subba Reddy
YSRCP

More Telugu News