Wanaparthy District: ఒకే ఇంట్లో నలుగురి మృతి.. ఒక్కో గదిలో ఒక్కొక్కరి మృతదేహం.. క్షుద్రపూజలు చేసిన గుర్తులు!

4 dies in a home
  • వనపర్తి జిల్లాలో ఘటన
  • ఇంట్లోని వంట గదిలో అజీరాం బీ మృతదేహం
  • డైనింగ్‌ హాలులో కూతురు ఆస్మా బేగం డెడ్‌బాడీ
  • ఇంటి వెనుక అల్లుడు ఖాజా పాషా మృతి
  • హాలులో చిన్నారి హసీనా మృతదేహం 
వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.  రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పలు వివరాలు తెలుసుకున్నారు.

మృతులను ఆజీరాం బీ(63,) ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా(10)గా గుర్తించారు. వారి ఇంట్లోని వంట గదిలో అజీరాం బీ మృతదేహం ఉండగా, డైనింగ్‌ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక ఖాజా పాషా, హాలులో హసీనా మృతదేహాలు కనపడ్డాయి.

వారింట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా కొన్ని గుర్తులు కనపడ్డాయి. ఖాజా పాషా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు ఉండడంతో పాటు అక్కడే ఓ గొయ్యి ఉంది. వీరిని ఎవరైనా హత్య చేరారా? లేక వారంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Wanaparthy District
Telangana
Crime News

More Telugu News