Vijayasai Reddy: అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: విజయసాయిరెడ్డి

  • వికేంద్రీకరణతో అమరావతికి ఎలాంటి నష్టం లేదు
  • అమరావతి రైతులకు నష్టం జరగదు
  • రియలెస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు
Amaravati will develop faster than now says Vijaysai Reddy

రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతికి తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజధాని వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని విజయసాయి అన్నారు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. మూడు రాజధానులతో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏఎంఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుందని చెప్పారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని... అయితే, రియలెస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరని అన్నారు.

More Telugu News