Nagababu: కుమార్తెలు నీటిపై మన ప్రతిబింబాల వంటివారు: నాగబాబు

Nagababu Comments on His Daughter goes Viral
  • పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకరు
  • వారిని వారిగానే ఉండనిద్దాం
  • ట్విట్టర్ లో నాగబాబు
కుమార్తెలు నీటిపై కనిపించే మన ప్రతిబింబాల వంటి వారని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. నిన్న తన కుమార్తె నీహారిక నిశ్చితార్థాన్ని ఘనంగా జరిపించిన ఆయన, తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "కుమార్తెలు నీటిపై మన ప్రతిబింబాల వంటి వారు. ఆ రూపాన్ని పట్టుకోవాలని ఎంత బలంగా ప్రయత్నిస్తే, అన్ని తరంగాలు పుడుతుంటాయి. కాబట్టి, వారిని వారిగానే ఉండనిద్దాం. వారి జీవితంలోని ప్రతి వేడుక, వారి ఎదుగుదలను గుర్తు చేస్తుంటుంది. లవ్ యూ నీహా" అని పోస్ట్ చేశారు.
Nagababu
Twitter
Niharika

More Telugu News