రష్యా టీకా సమర్థతపై సమాచారం లేదు: డబ్ల్యూహెచ్ఓ

Fri, Aug 14, 2020, 09:52 AM
Russia Vaccine Sputnik is Not in Advance Stage Says WHO
  • రష్యా నుంచి సమాచారం రాలేదు
  • ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నాం
  • 9 రకాల వ్యాక్సిన్లు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయన్న డబ్ల్యూహెచ్ఓ
ఈ వారం ప్రారంభంలో రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు.

 ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha