remdesivir: 'జైడిస్ కాడిలా' రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర రూ. 2,800.. ఫావిలో ట్యాబ్లెట్ రూ. 33 మాత్రమే!

  • దేశీయ మార్కెట్లోకి రెమ్‌డెసివిర్
  • ఫావిలో పేరుతో ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లు విడుదల
  • దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉండేలా చర్యలు
Zydus cadila Released Remdesivir Injection into Indian Market

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అందుబాటులోకి వచ్చిన రెమ్‌డెసివిర్ ఔషధాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినట్టు దాని తయారీదారు జైడిస్ కాడిలా నిన్న ప్రకటించింది. రెమ్‌డాక్‌ బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన దీనిని అందరికీ అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధర నిర్ణయించినట్టు తెలిపింది. 100 మిల్లీగ్రామ్ వయల్ ధర రూ. 2,800గా నిర్ణయించినట్టు తెలిపింది. దేశంలో అత్యంత చవగ్గా లభించే ఔషధం ఇదొక్కటేనని పేర్కొంది. తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడే రోగులకు రెమ్‌డెసివిర్ దివ్యౌషధంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే తేలింది.

దేశీయంగా అందుబాటులోకి తీసుకొచ్చిన రెమ్‌డెసివిర్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు జైడిస్ కాడిలా ప్రతినిధులు తెలిపారు. మరోవైపు, స్వల్పంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి ఇచ్చే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను ఎంఎస్ఎన్ గ్రూపు మార్కెట్లో విడుదల చేసింది.  ‘ఫావిలో’ పేరుతో అందుబాటులో ఉన్నాయి. 200 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ. 33గా నిర్ణయించింది.

More Telugu News