MS Dhoni: ధోనీకి కరోనా లేదు... సూపర్ కింగ్స్ శిబిరంలో ఆనందోత్సాహాలు!

Chennai Super Kings skipper MS Dhoni tested corona negative
  • ధోనీకి కరోనా నెగెటివ్ 
  • ధోనీ ఫాంహౌస్ కు వెళ్లి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది
  • శుక్రవారం చెన్నై వెళ్లనున్న ధోనీ
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి కరోనా నెగెటివ్ అని వచ్చింది. ధోనీ రాంచీలో కరోనా టెస్టు చేయించుకున్నాడు. వైద్య సిబ్బంది స్వయంగా ధోనీ ఉంటున్న ఫాంహౌస్ కు వచ్చి శాంపిల్స్ సేకరించారు. ఈ పరీక్షలో ధోనీకి కరోనా లేదని తేలింది. ఈ ఫలితంతో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలోనూ, అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ధోనీ శుక్రవారం చెన్నై వెళ్లి సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో జట్టుతో కలవనున్నాడు. సూపర్ కింగ్స్ జట్టు ఆగస్టు 21న యూఏఈ వెళ్లనుంది. ఈసారి ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు టోర్నీ జరగనుంది.
MS Dhoni
Corona Virus
Negative
Ranchi
Chennai
Super Kings

More Telugu News