Akhil: సీనియర్ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా

Akhil Akkineni under Tejas direction
  • బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తాజా చిత్రం 
  • తదుపరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో
  • తాజాగా కథ చెప్పిన సీనియర్ దర్శకుడు తేజ
చిన్న కొడుకు అఖిల్ కి మంచి హిట్ సినిమా ఇవ్వడం కోసం నాగార్జున ఎంతగానో ట్రై చేస్తున్నారు. పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటూ వస్తున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' చిత్రాన్ని చేస్తున్న అఖిల్ దానిపైన ఆశలు పెట్టుకున్నాడు. దీని తర్వాత చేసే చిత్రం కోసం ఇటీవల సురేందర్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. ఆయన చెప్పిన కథ అఖిల్ కి నచ్చిందని కూడా వార్తలొచ్చాయి.

ఇక ఆ ప్రాజక్టును అలా ఉంచితే, తాజాగా మరో సీనియర్ దర్శకుడు తేజ ఇటీవల ఓ కథను చెప్పాడట. అఖిల్ కి అది నచ్చడంతో తండ్రికి కూడా చెప్పించాడట. నాగార్జున కూడా ఆ కథను ఇష్టపడ్డారని, పూర్తి స్క్రిప్టు తయారుచేసుకుని రమ్మని చెప్పారని తాజా సమాచారం. ఒకవేళ ఇది కూడా ఓకే అయితే కనుక, సురేందర్ రెడ్డి ప్రాజక్టు తర్వాత ఇది సెట్స్ కు వెళుతుంది.      
Akhil
Nagarjuna
Teja
Surendar Reddy

More Telugu News