AADHAR: పరిశ్రమలకు ఆధార్ తరహా నెంబర్.. మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్!

  • ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట వివరాల సేకరణ
  • 9 అంశాలపై వివరాలను సేకరించనున్న గ్రామ సచివాలయ సిబ్బంది
  • అక్టోబర్ 15వ తేదీ లోగా సర్వేను పూర్తి చేయాలని ఉత్తర్వులు
AP govt decides to allocated unique number for each industry

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తరహాలోనే రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయించాలని నిర్ణయించింది. ఈ నంబర్ ను 'పరిశ్రమ ఆధార్' పేరుతో కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల సర్వే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15వ తేదీ లోగా సర్వేను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ సర్వేలో ప్రతి పరిశ్రమకు సంబంధించి కార్మికులు, ముడి సరుకు లభ్యత, మార్కెటింగ్, ఎగుమతులు, దిగుమతులు, విద్యుత్, నీరు, భూమి, ఇతర వనరులకు సంబంధించి వివరాలను సేకరించనున్నారు. మొత్తం 9 అంశాలకు సంబంధించి వివరాలను సేకరించబోతున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశ్రమల్లోని వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరిట ఈ సర్వేను చేపట్టనున్నారు.

More Telugu News