Land acquisition: ప్రకాశం జిల్లా టంగుటూరులో మైనింగ్ భూముల సేకరణపై హైకోర్టు స్టే

High court gives stay on land acquisition at Tanguturu
  • టంగుటూరు వద్ద వెయ్యికి పైగా ఎకరాల కేటాయింపు
  • మైనింగ్ భూములు ఇతర అవసరాలకు కేటాయించరాదన్న కోర్టు
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఏపీ సర్కారు పెద్ద ఎత్తున భూసేకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307 ఎకరాల మైనింగ్ భూములు ఇళ్ల స్థలాలకు కేటాయించడం వివాదాస్పదమైంది. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు భూ సేకరణపై స్టే ఇచ్చింది. ఇళ్ల స్థలాలకు, ఇతర అవసరాలకు మైనింగ్ భూముల కేటాయింపు వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Land acquisition
Tanguturu
Prakasam District
Stay
AP High Court
YSRCP
Andhra Pradesh

More Telugu News