Narendra Modi: నిజాయతీగా పన్నులు చెల్లించేవారికి లబ్ధి చేకూర్చే 'పారదర్శక పన్నుల విధాన వేదిక' తీసుకువచ్చాం: మోదీ

  • పన్నుల చెల్లింపు విధానంలో నూతన సంస్కరణలు
  • నేరుగా హాజరయ్యే అవసరంలేని కొత్త విధానం
  • నిజాయతీపరులను గౌరవించడమే దీని ఉద్దేశమన్న మోదీ
Modi explains faceless tax paying system

నిజాయతీగా పన్నులు చెల్లించేవారే జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారికి లబ్ధి చేకూర్చడం కోసం పారదర్శక పన్నుల విధాన వేదిక తీసుకువచ్చామని ప్రధాన నరేంద్ర మోదీ వెల్లడించారు. స్క్రూటినీలు, అప్పీళ్లకోసం పన్ను చెల్లింపుదారుడు నేరుగా అధికారుల ఎదుట హాజరవనవసరంలేని, 'ముఖ రహిత' సరళతర పన్నుల వ్యవస్థ ట్యాక్స్ చెల్లింపుదారుడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, నైతిక బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. దేశంలో పన్నుల సంస్కరణ పరంగా ఈ పారదర్శక పన్నుల విధాన వేదిక ఎంతో ముఖ్యమైన పరిణామం అని పేర్కొన్నారు.

ఈ సరికొత్త విధానం దేశ పౌరులందరికీ సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ విధానం ద్వారా పన్నుల వ్యవస్థ సరికొత్త పంథాను అందిపుచ్చుకుంటుందని, ఎంతో సులభతరం అవుతుందని మోదీ వివరించారు. "నిజాయతీపరులను గౌరవించడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమస్యలు ఉత్పన్నం కాని రీతిలో లావాదేవీలు మా పారదర్శక పన్నుల విధాన వేదిక లక్ష్యం. ఈ ముఖ రహిత విధానంలో... పన్నులు చెల్లిస్తున్నది ఎవరు, పన్నుల అధికారి ఎవరన్నది ముఖ్యం కాబోదు" అని వివరించారు.

  • Loading...

More Telugu News